Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాంగ్రెస్‌ నేత సంగమేశ్వర్‌ అంత్యక్రియలు

సంగమేశ్వర్‌ భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్న మంత్రి సబితారెడ్డివిద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు, నాయకుల నివాళి

ధారూరు: సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కోల్కుంద సంగమేశ్వర్‌ అంత్యక్రియల ను మంగళవారం ఆయన స్వగ్రామం తరిగోపులలో వ్యవసాయ క్షేత్రంలో ని ర్వహించారు. విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్‌, కాలె యాదయ్య, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌లు, హఫీజ్‌, ఇతర నాయకులు, న్యాయవాదులు, ప్రజలు సంగమేశ్వర్‌ భౌతికకాయానికి పూలమాలలు వేశారు. కుటుంబసభ్యులను ప రామర్శించారు. కాంగ్రెస్‌ నేత జి.ప్రసాద్‌కుమార్‌ సంగమేశ్వర్‌ అంతిమయాత్ర లో పాల్గొన్నారు. సంగమేశ్వర్‌ రాజకీయాల్లో నిజాయితీగా ప్రజలకు సేవలందించారని మంత్రి సబితారెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ కొనియాడారు.

Advertisement
Advertisement