సంగమేశ్వరుడికి పులి వాహనసేవ

ABN , First Publish Date - 2021-04-11T05:01:19+05:30 IST

సంగం పెన్నానది ఒడ్డున వెలసిన కామాక్షీదేవి సమేత సంగమేఽశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సంగమేశ్వరుడికి పులి

సంగమేశ్వరుడికి పులి వాహనసేవ
పులివాహనంపై సంగమేశ్వరుడు

సంగం, ఏప్రిల్‌ 10: సంగం పెన్నానది ఒడ్డున వెలసిన  కామాక్షీదేవి సమేత సంగమేఽశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సంగమేశ్వరుడికి పులి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. రాజుపాళెం గ్రామానికి చెందిన శ్రీరాం కృష్ణారావు, మోహన్‌లు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమూర్తి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా ఆలయంలోని స్వామి, అమ్మవార్ల మూల విరాట్‌లకు విశేష పూల అలంకరణ చేశారు. కార్యక్రమాలను ఈవో వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.

Updated Date - 2021-04-11T05:01:19+05:30 IST