Abn logo
Jan 14 2021 @ 11:22AM

మంటల్లో చిక్కుకున్న భార్యను రక్షించబోయి భర్త కూడా...

సంగారెడ్డి: జిల్లాలోని చౌటకూర్ మండలం లింగంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు  చాకలి ఎల్లేష్(40),  చాకలి సునీత(35) ఇద్దరు అగ్నికి ఆహుతయ్యారు. మద్యానికి బానిసైన భర్తను హెచ్చరిచేందుకు భార్య సునీత పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇదే క్రమంలో గత రాత్రి భర్త ఎల్లేష్ మద్యం సేవించి రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత తలుపులు బిగించి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  భార్యను కాపాడే ప్రయత్నంలో భర్తకు  కూడా మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన 14ఏళ్ల కూతురు మంచం కింద దాచుకుని కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి మంటలను ఆర్పివేశారు. అనంతరం ఇరువురిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఒకరు సంగారెడ్డి హాస్పిటల్‌లో, మరొకరు హైదరాబాద్ హాస్పిటల్‌లో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement
Advertisement