కేరళలో Sangh Parivar ఎజెండా విఫలం...కేరళ సీఎం వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-06T14:48:21+05:30 IST

కేరళలో వామపక్ష ఉద్యమం బలంగా ఉండటం వల్లే సంఘ్ పరివార్ మతపరమైన ఎజెండా కేరళలో పట్టు సాధించలేకపోయిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు...

కేరళలో Sangh Parivar ఎజెండా విఫలం...కేరళ సీఎం వ్యాఖ్యలు

తిరువనంతపురం: కేరళలో వామపక్ష ఉద్యమం బలంగా ఉండటం వల్లే సంఘ్ పరివార్ మతపరమైన ఎజెండా కేరళలో పట్టు సాధించలేకపోయిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.కమ్యూనిస్టు విప్లవకారుడు పి కృష్ణ పిళ్లై స్మారకార్థం ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా విజయన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ మత ప్రచారం చేస్తూ, ప్రజల మనసుల్లో అనుమానాలు రేకెత్తిస్తూ ప్రజా సంబంధాలను కలుషితం చేసేందుకు ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు.మతపరమైన నినాదాలతో ఇటీవల తలస్సేరిలో జరిగిన ఊరేగింపు, ఆహారానికి హలాల్ ధృవీకరణపై వివాదంపై విజయన్ ఆర్‌ఎస్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు.


‘‘వామపక్ష ఫ్రంట్‌ను బలహీనపరచడానికి ఆర్ఎస్ఎస్ వారు అనేక మతపరమైన ఎజెండాను అమలు చేసేందుకు ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఇప్పుడు వారు సమాజంలో గందరగోళం సృష్టించి, మతపరమైన ప్రచారం చేస్తున్నారు. ’’ అని  విజయన్ అన్నారు.హలాల్ ఆహారం, శబరిమలలో వడ్డించే ప్రసాదానికి హలాల్ ధృవీకరణపై ఇటీవల రాజుకున్న వివాదం సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి సంఘ్ పరివార్ అమలు చేస్తున్న ఎజెండాలో భాగమని ఆయన అన్నారు.ఇటీవల తలస్సేరిలో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన ఊరేగింపులో మసీదుల్లో ప్రార్థనలు నిలిపివేయాలని కోరుతూ నినాదాలు చేయడాన్నిసీఎం ప్రస్తావించారు.


‘‘ఇలాంటి నినాదాలు చేయడం ద్వారా వారి ఎజెండా ఏమిటి? కేరళలో తమ ఎజెండా పనిచేయదని వారికి బాగా తెలుసు. అయితే వారు అలాంటి ప్రచారాన్ని ప్రజల మనస్సుల్లోకి వ్యాప్తి చేయాలనుకుంటున్నారు’’ అని విజయన్ అన్నారు.ప్రజలు ధరించే దుస్తులు, ఆహారం, వివిధ సమాజాల సంస్కృతి, అన్నీ సంఘ్ పరివార్ దాడులకు గురవుతున్నాయని, అలాంటి బెదిరింపులను సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందని సీఎం విజయన్ కోరారు.


Updated Date - 2021-12-06T14:48:21+05:30 IST