‘టాప్స్‌’లో సానియా

ABN , First Publish Date - 2021-04-08T06:02:21+05:30 IST

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నాలుగేళ్ల తర్వాత టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌)లో చోటు దక్కింది...

‘టాప్స్‌’లో సానియా

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నాలుగేళ్ల తర్వాత టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌)లో చోటు దక్కింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌ సన్నాహకాల కోసం ప్రభుత్వం నుంచి సానియాకు ఆర్థిక సహకారం అందనుంది. 34 ఏళ్ల సానియా 2017లో గాయం కారణంగా ఆటకు విరామం తీసుకోవడంతో టాప్స్‌ నుంచి వైదొలగింది. ఇప్పుడు టోక్యో విశ్వక్రీడలకు అర్హత సాధించడంతో సానియాను మళ్లీ టాప్స్‌ జాబితాలో చేర్చారు. 


Updated Date - 2021-04-08T06:02:21+05:30 IST