హైదరాబాద్: పాక్ విమానం కూలిపోవడంపై ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా విమాన ప్రమాదంలో మరణించిన వారికి సానుభూతి తెలిపారు. ‘ఈ ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ఆ దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ బాధను తట్టుకునే శక్తిని వారికి ఆ భగవంతుడు ప్రసాదించాలి. వారికి ఎంత సానుభూతి తెలిపినా తక్కువే’ అని సానియా ట్వీట్ చేసింది. అలాగే సానియా భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపాడు.