Advertisement
Advertisement
Abn logo
Advertisement

గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం

అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

రోడ్లపై పారుతున్న మురుగు

పట్టించుకోని అధికారులు

ధర్మవరంరూరల్‌, డిసెంబరు 2: మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పారిశుద్ద్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నా యి. ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో దోమలు అధికమై రోగాల భారిన పడు తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీరు సక్రమంగా పారటం లేదు. దీం తో మురుగునీరు రోడ్డుపై పారుతుం డటంతో పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. మురుగునీరు నిల్వ ఉండి వీధులు, ప్రధాన రహదా రులు ఆధ్వానంగా తయారయ్యాయి. కొన్ని గ్రామాల్లో సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో గత కొద్దిరోజుల నుంచి కురు స్తున్న వర్షాల కారణంగా వర్షపునీరు నిల్వ ఉండి దుర్వాసన వెద జల్లుతోందని ప్రజలు వాపోతున్నారు. గొల్లపల్లిలో ప్రధాన కాలువ అంతా చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు పెరిగి కాలువ పూడికపోవడంతో మురుగునీరంతా రోడ్డుమీదే పారుతోంది. అదేవిధంగా బుడ్డారెడ్డిపల్లి, గొల్లపల్లి, రేగాటిపల్లి, గొట్లూరు కురుబ కాలనీ వద్ద, మల్లాకాల్వ, నిమ్మల కుంట, పోతుల నాగేపల్లి గ్రామముఖద్వారం వద్ద, సీసీకొత్తకోట, ధర్మపురి, చిగిచెర్ల తదితర గ్రామాల ప్రజలు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. అధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు. 

మూలనపడిన ఫాగింగ్‌ మిషన్లు

 మండలంలోని 14 పంచాయతీలకు రూ.45 వేల నుంచి 50వేల విలువ చేసే ఫాగింగ్‌ మిషన్లు కోనుగోలు చేశారు. వీటిని ఆయా పంచాయతీలకు పంపిణీ చేశారు. అయితే అప్పట్లోనే ఒకటిరెండు సార్లు ఫాగింగ్‌మిషన్లు బయటకు తీసి గ్రామాల్లో దోమల నివారణకు మందును పిచికారి చేయించా రు. అంతే అప్పటినుంచి ఇప్పటివరకు ఆ మిషన్లు సంగతే మర్చిపోయే పరిస్థితి నెలకొంది. వేలకు వేలు వెచ్చించి తెచ్చిన మిషన్లును వినియోగంలో తేవకుండా అధికారులు మూలన పడేశారన్న ఆరోపణలు ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి. 


Advertisement
Advertisement