పారిశుధ్య కార్యక్రమాలను యజ్ఞంలా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-20T06:06:19+05:30 IST

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పారి శుధ్య కార్యక్రమాలను యజ్ఞంలా పూర్తి చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు.

పారిశుధ్య కార్యక్రమాలను యజ్ఞంలా పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి

 కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో  పారి శుధ్య కార్యక్రమాలను యజ్ఞంలా పూర్తి చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు. శనివారం పట్టణంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాల యం నుంచి పారిశుధ్య కార్యక్రమాలు, హరితహారం పనుల నిర్వహణపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి రోజు ఇళ్ల నుంచి చెత్తను తడిపొడిగా వేరు చేసి సేకరించాలని, మురుగు కాలువలను శుభ్రం చేయడానికి అవ సరమైన లేబర్‌ అదనంగా డైలీవేజిస్‌ కింద ఏర్పాటు చేసుకోవాలని సూ చించారు. పటిష్ట పారిశుధ్య, స్వచ్చత ముందుండేలా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌లు, ట్యాంకర్లను మంజూరు చేయడంతో పాటు ప్రతినెల బడ్జెట్‌ను కూడా కేటాయిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రహదారుల వెంట ఇరువైపులా ఎవెన్యూ ప్లానిటేషన్‌ జరగాలని, మొక్క లను నాటడం మాత్రమే కాకుండా నాటిన ప్రతి మొక్క బతికేలా ట్యాం కర్ల ద్వారా క్రమం తప్పకుండా ప్రతి నిత్యం నీటిని అందించాలని సూ చించారు. దుకాణాల ముందున్న మొక్కల సంరక్షణ బాధ్యతలను ఇంటి, దుకాణ యజమానులకు అందించడం జరపాలన్నారు. ప్రజలు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం, చెత్త డబ్బాలలో వాడి పడేసేలా చర్యలు తీసు కో వాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు విరివిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల ఆర్డీఓలు మాదురి, వి నోద్‌కుమార్‌, పలువురు ఎంపీడీఓలు, ఎంపీఓలు, మండల ప్రత్యేకాధి కారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T06:06:19+05:30 IST