పారిశుధ్యం ప్రత్యేకదృష్ఠి

ABN , First Publish Date - 2022-06-25T06:35:25+05:30 IST

రాష్ట్రంలోని ఎంపిక చేసిన మున్సిపాలిటీలలో ఇంటిగ్రేటేడ్‌ శానిటేషన్‌ ప్రోగ్రామ్‌ను అమలు చేయబోతున్నారు.

పారిశుధ్యం ప్రత్యేకదృష్ఠి
నిర్మల్‌ మున్సిపల్‌ కార్యాలయం

మున్సిపాలిటీలో ఇంటిగ్రేటేడ్‌ శానిటేషన్‌ 

నిర్మల్‌ మున్సిపాలిటీకి అవకాశం 

రాష్ట్రంలో మొత్తం 20 మున్సిపాలిటీలకు అవకాశం 

ప్రత్యేకబృందాల ఆధ్వర్యంలో 20 రోజుల పాటు సర్వే 

భారీగా నిధుల కేటాయింపునకు అవకాశం 

పారిశుధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం

నిర్మల్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ఎంపిక చేసిన మున్సిపాలిటీలలో ఇంటిగ్రేటేడ్‌ శానిటేషన్‌ ప్రోగ్రామ్‌ను అమలు చేయబోతున్నారు. 20 మున్సిపాలిటీల్లో పకడ్బందీగా శానిటేషన్‌ ప్రోగ్రామ్‌ అమలు కోసం సంబంధిత అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 20 మున్సిపాలిటీల్లో అస్కీ (అడ్మినిస్ర్టేషన్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా)కు సంబంధించిన అధికారులు 20 రోజుల పాటు క్షేత్రస్థాయి సర్వే చేపట్టబోతున్నారు. మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో ఈ బృందాలు పర్యటించి అక్కడి పారిశుధ్య పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ, మురికికాలువల పరిస్థితులను అఽధ్యయనం చేయనున్నాయి. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమంలో భాగంగానే ఈ మున్సిపాలిటీ ఎంపిక జరిగింది. ఇప్పటి వరకు 20 మున్సిపాలిటీల్లో అమలవుతున్న. ప్రగతి కార్యక్రమాలను పరిగణలోకి తీసుకొని అందులోని లోటుపాట్లు, భవిష్యత్‌లో మరింత మెరుగైన ప్రగతి కోసం అవసరమయ్యే సిఫారసులతో కూడిన నివేదికలను ఈ బృందాలు రూ పొందించనున్నాయి. ఈ నివేదికల ఆధారంగా స్వచ్ఛసర్వేక్షన్‌ 2023 కింద ఎంపిక అవకాశంతో పాటు మున్సిపాలిటీలకు పెద్దమొత్తంలో శా నిటేషన్‌ కోసం నిధులు మంజూరుకానున్నాయి. 

స్వచ్ఛ సర్వేక్షణ్‌ కోసం రెండు మున్సిపాలిటీలు ఎంపిక

స్వచ్ఛసర్వేక్షన్‌ కోసం 2023 కింద ఎంపిక అయ్యేందుకు గాను నిర్మల్‌, ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలకు అవకాశం కల్పించారు. ఈ రెండు మున్సిపాలిటీలతో పాటు రాష్ట్రంలోని మొత్తం 20 మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. బహిరంగ మల విసర్జన లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమం కింద మున్సిపాలిటీలకు అవకాశం కల్పించారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌తో పాటు మరో 18 మున్సిపాలిటీలో ఇక నుంచి ఇంటిగ్రేటేడ్‌ శానిటేషన్‌ ప్రోగ్రామ్‌ అమలు చేసేందుకు సం బంధిత శాఖల అధికారులు పనులు మొదలుపెట్టారు. కాగా అడ్మినిస్ర్టేషన్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాతో క్షేత్రస్థాయి పరిస్థితులను అనుసంధానం చేస్తుండడం ప్రాధాన్యతను సంతరరించుకుంటోంది. 

పారిశుధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం

కాగా మున్సిపాలిటీల్లో నెలకొంటున్న పారిశుధ్య సమస్యకు ఈ స్కీమ్‌ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందంటున్నారు. రాష్ట్ర నిధులతో పా టు కేంద్రనిధులు పెద్దఎత్తున మంజూరు కానున్న కారణంగా పారిశుఽఽధ్య పనులకు నిధులు పెద్దమొత్తంలో వ్యయం చేసే అవకాశం ఉం టుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత కారణంగా పారిశుధ్య పనుల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతోంది. అలాగే ప్రజల్లో అవగాహన లేకపోవడంతో మురికి కాలువలు, పరిసరాల ప్రాంతాలు చెత్త చె దారంతో నిండిపోతున్నాయంటున్నారు. బాధ్యతను విస్మరిస్తూ నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా పారిశుధ్య సమస్య ప్రస్తుతం మున్సిపాలిటీలకు పెద్దసవాలుగా మారిందంటున్నారు. పట్టణప్రగతి లాంటి కార్యక్రమాలు కూడా నిధుల కొరత కారణంగా పారిశుధ్య సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోతోందంటున్నారు. ఇంటిగ్రేటేడ్‌ సానిటేషన్‌ విధానంతో పారిశుధ్య సమస్యకు మున్సిపాలిటీల్లో శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. 

టౌన్‌ శానిటేషన్‌ సమస్య తీరుతుంది

స్వచ్ఛ సర్వేక్షన్‌ పరిధిలోకి నిర్మల్‌ మున్సిపాలిటీ చేరబోతున్న కారణంగా క్షేత్రస్థాయి శానిటేషన్‌ సమస్యలు తీరుతాయి. దీని కోసం గానూ ప్రత్యేకటీమ్‌లు మున్సిపాలిటీలోని అన్నివార్డుల్లో పర్యటించి అక్కడి పారిశుధ్య సమస్యలను అఽధ్యయనం చేయనున్నాయి. నివేదికల రూపకల్పనతో పాటు మున్సిపల్‌ శానిటేషన్‌ అధికారులు , సిబ్బందికి పలు సూచనలు , సలహాలు కూడా అందించనున్నాయి. పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుధ్య సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడుతోంది. ఇప్పటికే సంబందిత సానిటేషన్‌ అధికారులు , సిబ్బందికి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. 

- సంపత్‌కుమార్‌, కమిషనర్‌, నిర్మల్‌ మున్సిపాలిటీ 


శిక్షణతో పాటు చాలా అంశాలు నేర్చుకున్నాం

 స్వచ్చ సర్వేక్షణ్‌ పథకం కింద అమలు చేయతలపెట్టిన ఇంటిగ్రేటేడ్‌ సానిటేషన్‌ ప్రోగ్రాంపై శిక్షణ పూర్తయ్యింది. ఈ శిక్షణ ద్వారా తాము చాలా కొత్త విషయాలుల నేర్చుకున్నాం. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మురికి కాలువల నిర్వహణ, బహిరంగ మలవిసర్జన లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దడం, రోడ్లను శుభ్రం చేయడం, చెత్తసేకరణ, అలా గే పరిసరాల పరిశుభ్రత లాంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. త్వరలోనే ప్రత్యేక బృందాలు, వార్డుల్లో క్షేత్రస్థాయి పర్యటనలు జరపనున్నాయి. స్వచ్చ సర్వేక్షన్‌ కింద నిర్మల్‌ మున్సిపాలిటీకి అవకాశం కల్పించడం గర్వకారణంగా ఉంది. 

- మురారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, నిర్మల్‌ మున్సిపాలిటీ

Updated Date - 2022-06-25T06:35:25+05:30 IST