పారిశుధ్య కార్మికుల సమ్మె నోటీసు

ABN , First Publish Date - 2022-01-28T05:55:08+05:30 IST

పీఆర్‌ సీపై ప్రభుత్వం అవలం భిస్తున్న తీరుకు నిరసనగా ఫిబ్రవరి 7వతేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు పారిశు ధ్య కార్మికులు మున్సిపల్‌ కమిష నర్‌ మల్లికా ర్జునకు సమ్మె నోటీసు అంద జేశారు.

పారిశుధ్య కార్మికుల సమ్మె నోటీసు

ధర్మవరం, జనవరి 27: పీఆర్‌ సీపై ప్రభుత్వం అవలం భిస్తున్న తీరుకు నిరసనగా ఫిబ్రవరి 7వతేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు పారిశు ధ్య కార్మికులు మున్సిపల్‌ కమిష నర్‌ మల్లికా ర్జునకు సమ్మె నోటీసు అంద జేశారు. ఈ మేరకు గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుఽ ద్య కార్మి కులు స్థానిక  కమిషన ర్‌ను  కలిసి సమస్యను విన్నవిం చా రు. ప్రధానం గా రాష్ట్ర ప్రభు త్వం జీతాల పెంపులో తీరని అ న్యాయం చేసిందన్నారు.  ఆప్కాస్‌ పరి ధిలో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం, కరువుభత్యం, మధ్యంతర భృతి, ఇంటి అద్దెలు ఇవ్వక పో వడంపై  ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ అసోసి యేషన్‌ వి జ్ఞప్తి మేరకు  సమ్మెకు వెళ్తున్నట్టు కార్మి కులు తెలిపారు. వినతి పత్రం అం దించిన వారిలో సీఐటీయూ జిల్లా ఉపాఽధ్యక్షులు జేవీ రమణ, సీఐటీయూ నాయకులు అయూబ్‌ఖాన్‌, ఎల్‌ ఆదినారాయణ, పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు వెంకటరాముడు, ప్రసాద్‌, పుల్లన్న, బాబు, రఫీ, పెద్దక్క, చెన్నయ్య, ఆదినారా యణ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-28T05:55:08+05:30 IST