ఇలాంటి శానిటైజర్‌లతో చేతులు మటాష్

ABN , First Publish Date - 2020-06-30T23:03:43+05:30 IST

లాక్‌డౌన్‌కి ముందు శానిటైజర్ కొద్ది మందికి మాత్రమే అలవాటు ఉండేది. ఇప్పుడు నిత్యవసర వస్తువు అయ్యింది.

ఇలాంటి శానిటైజర్‌లతో చేతులు మటాష్

ఇంటర్నెట్ డెస్క్: లాక్‌డౌన్‌కి ముందు శానిటైజర్ కొద్ది మందికి మాత్రమే అలవాటు ఉండేది. ఇప్పుడు నిత్యవసర వస్తువు అయ్యింది. దీన్ని కొంతమంది వ్యాపారంగా మార్చేసుకున్నారు. నకిలీ రాయుళ్లు మార్కెట్లోకి వచ్చేశారు. తక్కువ రకం శానిటైజర్లతో లాభ పడుతున్నారు. ఇది చర్మ సంబంధ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఇథనాల్‌తో శానిటైజర్ తయారు చేస్తారు. కానీ కొంతమంది బ్లాక్ మార్కెట్ మోసగాళ్లు మిథనాల్‌తో తయారు చేస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. శానిటైజ్ కొనేటప్పుడు ఇథైల్ ఉంటేనే కొనండని చెబుతున్నారు. శానిటైజర్ ద్రావణం ఉంటేనే మంచి ప్రయోజనం. చేతుల్లో వేసుకుంటే వెంటనే ఆవిరి అవ్వాలి. మరోపక్క అదే పనిగా శానిటైజ్ వాడితే చేతులు పొడిబారి, పగుళ్లు ఏర్పడి, దురదపుట్టడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వీటివల్ల యాంటి బయోటిక్స్ కూడా ఒకనాటికి పనిచేయడం మానేస్తాయని అంటున్నారు.  

Updated Date - 2020-06-30T23:03:43+05:30 IST