Abn logo
Aug 11 2020 @ 23:11PM

సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సరా..?

2020 సంవత్సరం అస్సలు బాగాలేదు. ఎన్నో వినకూడని వార్తలు, మందు లేని మహమ్మారి, చావులు.. ఒక్కటేమిటి.. చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. మానవుడు ప్రశాంతంగా బ్రతకలేని స్థితిలో ఉన్నాడు. మనస్ఫూర్తిగా ఎదుటివారితో మాట్లాడలేని, షేక్ హ్యాండ్ ఇవ్వలేని.. ఇంకా చెప్పాలంటే ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టలేని చాలా కఠినమైన పరిస్థితులను నేడు మానవుడు ఎదుర్కొంటున్నాడు. విషయంలోకి వస్తే.. మరో బాధాకరమైన వార్త ఇది. ఇటీవల శ్వాస వ్యాధితో బాధపడుతూ.. ముంబై లీలావతి హాస్పటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చిన సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్ అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది.


నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయమే. ఒక మనిషికి ఇన్ని పరీక్షలు ఉంటాయా అని అనిపిస్తుంది సంజయ్ దత్‌ను చూస్తుంటే. ఎన్నో కష్టాలను అధిగమించి ప్రశాంతమైన జీవితం సాగిస్తున్న సంజయ్ దత్‌కు మళ్లీ లంగ్ క్యాన్సర్ సమస్య అంటే.. వినడానికే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రస్తుతం సంజయ్ దత్ యుఎస్‌లో ఈ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు వెళ్లబోతున్నట్లుగా ముంబై మీడియా ప్రకటించింది. ఆయన ఈ క్యాన్సర్ బారి నుంచి త్వరగా కోలుకుని.. మళ్లీ సినిమాలతో అందరినీ అలరించాలని ఆశిద్దాం.

Advertisement
Advertisement
Advertisement