సంజయ్‌దత్, కంగనారనౌత్... ఇద్దరూ బాలీవుడ్ స్టార్స్. కానీ సినిమా షూటింగ్కోసం హైదరాబాద్ వచ్చారు. ఒకే హోటల్లో ఉంటున్న విషయం తెలుసుకొని కలుసుకున్నారు. ‘‘సంజయ్‌దత్ పూర్తి ఆరోగ్యంతో చక్కగా ఉన్నారు. హైదరాబాద్‌లో నేను ఉంటున్న హోటల్లోనే సంజయ్ సార్ ఉంటున్నారని తెలిసి వెళ్లి కలిశాను. ఆయన చాలా ఆరోగ్యంగా, హ్యాండ్సమ్గా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. దేవుడు ఆయనకు మరింత ఆయుష్షును ప్రసాదించాలి అని ప్రార్థిస్తున్నాను’’ అని శుక్రవారం కంగన ట్వీట్ చేశారు. ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడిన సంజయ్‌దత్ ఇటీవల కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆయన ప్రస్తుతం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. కంగన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న చివరి షెడ్యూల్ షూటింగ్లో ఆమె పాల్గొంటున్నారు.