సంజయ్‌ స్పోర్ట్స్‌ డ్రామా

ABN , First Publish Date - 2020-12-13T07:04:04+05:30 IST

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, రాజీవ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో వరుణ్‌ బుద్ధదేవ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తులసీదాస్‌ జూనియర్‌’...

సంజయ్‌ స్పోర్ట్స్‌ డ్రామా

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, రాజీవ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో వరుణ్‌ బుద్ధదేవ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తులసీదాస్‌ జూనియర్‌’. టీ సిరీస్‌ యజమాని భూషణ్‌కుమార్‌, అశుతోష్‌ గోవార్కర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ను  శుక్రవారం సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంజయ్‌దత్‌ స్నూకర్‌ కోచ్‌గా నటిస్తున్నారు. కథ, దర్శకత్వం మృదుల్‌. 

Updated Date - 2020-12-13T07:04:04+05:30 IST