Advertisement

Aryan Khan`s Drug Caseలో బాలీవుడ్ మౌనం సిగ్గుచేటు: సంజయ్ గుప్తా

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఈ నెల రెండో తేదీన అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్‌ ముంబై ఆర్థర్‌ రోడ్డు జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి ఆర్యన్‌ను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు షారుక్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అవేవీ ఫలించడం లేదు. కొడుకు అరెస్ట్ కావడంతో విషాదంలో మునిగిపోయిన షారూక్ కుటుంబానికి పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. తాజాగా బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్ గుప్తా కూడా షారూక్‌కు మద్దతుగా నిలిచారు. 


`సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న వేల మందికి షారూక్ ఉపాధి క‌ల్పించాడు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించాడు. సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన‌ ప్ర‌తీ విష‌యంలోనూ షారుక్ ముందుంటాడు. అలాంటిది ఆయన సంక్షోభంలో చిక్కుకున్న ప్రస్తుత సమ‌యంలో బాలీవుడ్‌ సినీ ప‌రిశ్ర‌మ నిశ్శ‌బ్దంగా ఉంది. దీనికంటే సిగ్గుచేటు మ‌రొక‌టి లేదు` అంటూ ట్వీట్‌ చేశారు. `ఈ రోజు షారుక్‌ కుమారుడు ఉన్నాడు, రేపు మా వాళ్లు లేదా మీ వాళ్లు ఉండొచ్చు. అప్పుడు కూడా ఇలాగే మౌనంగా ఉంటారా?` అని ప్రశ్నించారు.

Advertisement

Bollywoodమరిన్ని...