Abn logo
Aug 1 2020 @ 03:13AM

నోరు జారను.. బుద్ధిగా ఉంటా

కామెంట్రీ ప్యానెల్‌లోకి తీసుకోవాలంటూ  బీసీసీఐకి మంజ్రేకర్‌ లేఖ

ముంబై: తరచూ ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కామెంటేటర్‌గా ఉద్వాసనకు గురైన మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. తనను మళ్లీ కామెంట్రీ ప్యానెల్‌లోకి తీసుకోవాల్సిందిగా బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. గతంలో జరిగిన దానికి మరోసారి క్షమాపణలు కోరుతున్నాననీ, ఇకనుంచి ఎవరి విషయంలోనూ నోరు జారనని హామీ ఇస్తున్నట్టు బోర్డుకు ఈ-మెయిల్‌ రూపంలో లేఖ పంపాడు. బోర్డు కూడా మంజ్రేకర్‌ విన్నపాన్ని మన్నించి మళ్లీ ప్యానెల్‌లోకి తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది ఇంగ్లండ్‌లో వరల్డ్‌ కప్‌ సందర్భంగా రవీంద్ర జడేజాపై  ‘అరకొర ఆటగాడు’ అని మంజ్రేకర్‌ కామెంట్‌ చేయడంతోపాటు మరికొందరిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
Advertisement