విమానాల్లో 33 మంది వలస కార్మికులను పంపుతున్న ఎంపీ

ABN , First Publish Date - 2020-06-03T22:18:06+05:30 IST

విధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ వైపు చర్యలు తీసుకుంటుండగా..

విమానాల్లో 33 మంది వలస కార్మికులను పంపుతున్న ఎంపీ

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ వైపు చర్యలు తీసుకుంటుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ మరో అడుగు ముందుకు వేశారు. ఒక ఎంపీగా తనకు ఏటా ప్రభుత్వం కల్పించే 34 ఎయిర్ టిక్కెట్లతో 33 మంది వలస కార్మికులను విమానాల్లో పాట్నా పంపాలని నిర్ణయించారు.


'ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌కు చెందిన 1200 మంది వలస కార్మికులను 42 బస్సుల్లో వారివారి ఇళ్లకు పంపిచేందుకు కృషి చేశాం. ఒక ఎంపీగా నాకు ప్రభుత్వం నుంచి 34 ఎయిర్ టిక్కెట్లు వస్తాయి. 33 మంది వలస కార్మికులను పాట్నా చేర్చేందుకు వీటిని ఉపయోగిస్తున్నాను' అని బుధవారంనాడు మీడియాతో సంజయ్ సింగ్ చెప్పారు. బుధవారం 21 మందితో, గురువారం 12 మందితో తాను పాట్నా వెళ్తున్నట్టు చెప్పారు. అలాగే, ఢిల్లీ నుంచి పాట్నాకు ఇంకో 180 మంది వలస కార్మికులను గురువారంనాడు మరో విమానంలో పంపుతున్నట్టు చెప్పారు. వలస కార్మికులంతా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాలకు చెందిన వారని, పరిస్థితులు చక్కబడగానే తిరిగి వెనక్కి వస్తామని వారంతా తనకు చెప్పారని కూడా సంజయ్ సింగ్ తెలిపారు.

Updated Date - 2020-06-03T22:18:06+05:30 IST