Abn logo
Oct 22 2020 @ 03:25AM

కవర్‌ డ్రైవ్‌, పుల్‌షాట్‌ !

Kaakateeya

పిచ్‌పై వెడ్డింగ్‌ ఫొటోషూట్‌

బంగ్లా క్రికెటర్‌ వినూత్నం


ఢాకా: ప్రస్తుతం పెళ్లిళ్ల కంటే కూడా..అంతకుముందు జరిగే ఫొటోషూట్‌లే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అలాగే బంగ్లాదేశ్‌ మహిళా క్రికెటర్‌ సంజిదా ఇస్లామ్‌ కూడా వినూత్న వెడ్డింగ్‌ ఫొటోషూట్‌తో వార్తల్లో నిలిచింది. 24 ఏళ్ల సంజిదా..బంగ్లాదేశ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ మిమ్‌ మొసాదెక్‌ను పెళ్లాడింది. అంతకుముందు.. నారింజ రంగు చీరతో.. సంప్రదాయ రీతిలో ముస్తాబైన సంజిదా బ్యాటు చేతపట్టుకొని గ్రౌండ్‌లో కవర్‌ డ్రైవ్‌, పుల్‌షాట్లు కొడుతూ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఈ చిత్రాలను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ‘డ్రెస్‌, జ్యూయలరీ, క్రికెట్‌ బ్యాట్‌. క్రికెటర్ల వెడ్డింగ్‌ ఫొటో షూటవుట్లు ఇలా ఉంటాయి’ అన్న క్యాప్షన్‌తో తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలు విపరీతంగా వైరల్‌ కావడంతోపాటు సంజిదా ఆలోచన అద్భుతమని కొందరు ప్రశంసలు కురిపించగా, మరికొందరు విమర్శించారు.

Advertisement
Advertisement