ముక్కంటి ఆలయంలో సంకష్టహర చతుర్ధశి పూజలు

ABN , First Publish Date - 2022-01-22T05:41:55+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా సంకష్టహర చతుర్ధశి పూజలు నిర్వహించారు.

ముక్కంటి ఆలయంలో సంకష్టహర చతుర్ధశి పూజలు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హోమం నిర్వహిస్తున్న దృశ్యం

శ్రీకాళహస్తి, జనవరి 21: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా సంకష్టహర చతుర్ధశి పూజలు నిర్వహించారు. ఆలయంలోని అంజి వినాయకస్వామి ఆలయంలో వేద పండితులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంకష్టహర చతుర్ధశి హోమం, మంత్రపుష్పం, దీపారాధన నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్‌ విజయసారథి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:41:55+05:30 IST