పండగ వేళ.. ఆనంద హేళ

ABN , First Publish Date - 2022-01-17T06:16:19+05:30 IST

జిల్లాలో సంక్రాంతి, కనుమ వేడుకలను అంబరాన్నంటాయి. శనివారం సంక్రాంతి సందర్భంగా ఉదయాన్నే అతివలు రంగు రంగుల ముగ్గులు వేశారు.

పండగ వేళ.. ఆనంద హేళ
పోటీల్లో ముగ్గులు వేస్తున్న మహిళలు

జిల్లాలో అంబరాన్నంటిన సంక్రాంతి వేడుకలు

ముగ్గులతో అవనికి కొత్త రంగులు అద్దిన అతివలు

నెట్‌వర్క్‌: జిల్లాలో సంక్రాంతి, కనుమ వేడుకలను అంబరాన్నంటాయి. శనివారం సంక్రాంతి సందర్భంగా ఉదయాన్నే అతివలు రంగు రంగుల ముగ్గులు వేశారు. కొన్ని ప్రాంతాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఖమ్మం నగరంలోని ఐదో డివిజన్‌లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు హాజరై ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈకార్యక్రమంలో కార్పొ రేటర్లు నాగండ్ల కోటేశ్వరరావు, దండా జ్యోతిరెడ్డి, నాయకులు రాధాకృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం కనుమ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో కోడిపందేలు ఘనంగా నిర్వహించారు. కనుమ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులు వారి ప్రాంతాల్లోని గోవులను పూజించారు.

సమైఖ్యతకు చిహ్నం సంక్రాంతి

తెలుగు రాష్ట్రాల ప్రజల సమైఖ్యతను చాటే పండుగ సంక్రాంతి అని తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు అన్నారు. సంక్రాంతి సందర్భంగా శనివారం తల్లాడ మండలం రెడ్డిగూడెంలో సర్పంచ్‌ బద్దం నిర్మల ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌ బద్దం నిర్మల, కోటిరెడ్డి దంపతులు గ్రామాభివృద్ధి, ఐక్యత కోసం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, సొసైటీ చైర్మన్‌ రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, టీఆర్‌ఎస్‌ జోన్‌ కన్వీనర్లు బద్దం కోటిరెడ్డి, దిరిశాల దాసూరావు, జీవీఆర్‌, ఉపసర్పంచ్‌ కాంపాటి వీరయ్య పాల్గొన్నారు.

బోనకల్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బోనకల్‌, చిరునోముల, చొప్పకట్లపాలెంలో పండుగ సందర్భంగా కబడ్డీ, క్రికెట్‌, షటిల్‌, ముగ్గుల పోటీలను నిర్వహించారు. చొప్పకట్లపాలెంలో గెలుపొం దిన జట్లకు హాస్టల్‌ వేల్ఫేర్‌ ఆఫీసర్‌ విజయ బహుమతులను పంపిణీ చేశారు. బోనకల్‌ గ్రామంలో వైస్‌ ఎంపీపీ గుగులోతు రమేష్‌, ప్రీజం మల్టిమీడియా అధినేత మరీదు శ్రీనివాస్‌లు క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. 

 సంక్రాంతి సంబురాలలో భాగంగా గత నాలుగురోజుల నుంచి ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలో మండలస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. మండలస్థాయి కబడ్డీ పోటీలతో పాటు గ్రామస్థాయిలో ముగ్గులు, చదరంగం, క్విజ్‌,పాటలు, తాడుగుం జుడు, తదితర క్రీడలు నిర్వహించి విజేతలకు శనివారం బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్‌, రైతుసంఘం జిల్లా కమిటీసభ్యులు దివ్వెల వీరయ్య, రైతుసంఘం మండల కార్యదర్శి గొల్లపుడి కోటేశ్వ రరావు, మహిళ సంఘం మండల అధ్యక్షురాలు గొల్లపుడి లక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు, నల్లమోతు హనుమంతరావు, వెంకటనారాయణరెడ్డి, శ్రీహరి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

గొల్లపూడిలో గోదాదేవి రంగనాథుల కల్యాణం

వైరా మండలంలోని గొల్లపూడి శ్రీపులిగొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆది వారం గోదాదేవి రంగనాథుల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఈవో హరి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఈ కల్యాణ వేడుకల ఏర్పాట్లు చేశారు. అర్చకులు రంగనాథాచార్యులు, రవికుమారాచార్యులు, చంద్రాచార్యులు ఈ కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. 

రెబ్బవరంలో ముగ్గులు, క్రీడా పోటీలు

వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకొని శని, ఆదివారాల్లో ముగ్గులు, క్రీడా పోటీలను గ్రామస్థులు నిర్వహించారు. మహిళలకు ముగ్గులు, కబడ్డీ, వాలీబాల్‌, మ్యూజికల్‌ చైర్‌, తాడు ఆట, టెన్నీకాయిట్‌ అలాగే యువకులకు కబడ్డీ, వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. సర్పంచ్‌ సాదం రామారావు తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే వైరా మునిసిపాలిటీ పరిధిలోని పదోవార్డు గండగలపాడులో ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో పలురకాల పోటీలు నిర్వహించారు.

బోనకల్‌ మండలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా జిల్లా లింగాల మామిడి తోటల్లో నిర్వహించిన కోడే పందేలకు మండలంలో అత్యధికులు తరలి వెళ్లారు. బిర్రులలో పోటాపోటీగా జరిగిన పందేలలో రెండు వర్గాల మద్య దాడులు జరగడంతో వీక్షణకు వెళ్లిన వారు భయభ్రాంతులకు లోనయ్యారు. కొంతమంది దూర ప్రాంతాలలో జరిగిన కోడి పందేల వీక్షణకు వెళ్లారు.

ముదిగొండ మండల వ్యాప్తంగా శనివారం సంక్రాంతి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వెంకటాపురం గ్రామంలో రాయల కమలమ్మ జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను సీపీఎం సీనియర్‌ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, మందరపు పద్మ, కందుల భాస్కర్‌రావు పంపిణీ చేశారు.

ఘనంగా గోదాదేవి కళ్యాణం

ఖమ్మం నగరంలోని స్తంబాద్రి లక్ష్మినర్సింహాస్వామి ఆలయంలో ఆదివారం గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ధునర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతీఏటా కనుమ రోజు ఆలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహించడం ఆచారం. దీనిలో భాగంగానే గోదాదేవి కల్యాణం ను ఆలయ అర్చకులు నరహరి నర్సింహాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అతితక్కువ మంది భక్తులు, ఆలయ అర్చకుల మధ్యనే నిర్వహించామని ఆలయ ఈవో కొత్తూరు జగన్మోహన్‌రావు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానంన నిర్వహించారు

నేలకొండపల్లిలో

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నేలకొంపడపల్లిలో ఆరెగూడెంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఐద్వా ఆద్వర్యంలో మూటాపురంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలను నేలకొండపల్లి ఎస్సై స్రవంతిరెడ్డి ప్రారంభించి, గెలుపొందిన వారికి బహుమతులను అందచేసారు 

విజేతలకు బహుమతుల అందజేత

నగరంలోని 18వడివిజన్‌లో భారతీయ జనతాపార్టీ మహిళ మోర్చా ఆద్వర్యంలో శని వారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కిసాన్‌మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లాప్రధానకార్యదర్శి రుద్ర ప్రదీప్‌, వివేకానంద ఉత్స వ సమితి అధ్యక్షులు మోతుకూరి నారాయణరావులు హాజరై విజేతలకు బహుమ తులు అందించారు. కార్యక్రమంలో బీజేపీవన్‌టౌన్‌ మహిళ మోర్చా అధ్యక్షురాలు గోలి ఫణికుమార్‌, మంద సరస్వతి, ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.

వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

నగరంలోని 3వపట్టణంలో సహకారబ్యాంకు, రైల్వేస్టేషన్‌ రోడ్డు ప్రాంతాలలో వాసవీక్లబ్‌ గ్రేటర్‌ ఖమ్మం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి వాస వీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా గవర్నర్‌ యర్రం సుజాత పాల్గని విజేతలకు బహుమతులు అందించారు. ఈకార్యక్రమంలో వాసవీక్లబ్‌ గ్రేటర్‌ ఖమ్మం అధ్యక్షులు యర్రం బాలేందు శేఖరం, శైలజ, సీతామహాలక్ష్మి, స్వరూపరాణి, వాసవీక్లబ్‌సభ్యులు మల్లిఖార్జునరావు, వెంకటసుబ్బారావు, మణికుంఠ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T06:16:19+05:30 IST