సంక్రాంతిని రైతు దినోత్సవంగా జరపాలి

ABN , First Publish Date - 2021-01-16T05:16:32+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయకూలీలు, యువతకు ఉపాధి లభించాలనే సదుద్దేశంతో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చి న జాతీయ ఉపాధిహామీ పధకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయా లని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

సంక్రాంతిని రైతు దినోత్సవంగా జరపాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల రూరల్‌, జనవరి 15 : గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయకూలీలు, యువతకు ఉపాధి లభించాలనే సదుద్దేశంతో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చి న జాతీయ ఉపాధిహామీ పధకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయా లని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గ్రామీణ ప్రాం తాల్లో 70 శాతం వ్యవసాయంపై ఆధారపడ్డారని వ్యవసాయానికి అనుబంధం గా అనాధిగా ప్రతి ఇంటిలో పాడిపశువులు ఉండేవని గుర్తుచేశారు. పొరండ్ల గ్రా మంలో కనుమ పండుగ వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రైతులు, నాయకులు కు టుంబసభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను రైతు ది నోత్సవంగా ప్రకటించాలని, ఉత్తమ రైతులను సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వా నికి లేఖ రాస్దానని ఎమ్మెల్సీ అన్నారు. రైతులుఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని డిమాండ్‌ చే శారు. ప్రతి ఇంటికి 50 శాతంతో రాయితీతో 50 శాతం భ్యాంక్‌ రుణంతో ఒక పాడి పశువును ఇవ్వాలని ఎమ్మెల్సీ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో స ర్పంచ్‌ సంధ్యారాణి శ్రీనివాష్‌రెడ్డి, రూరల్‌ మండల అధ్యక్షుడు జున్ను రాజేంద ర్‌, మాజీ ఎంపీటీసీ రాధకిషన్‌రావు, నాయకులు భాస్కర్‌రెడ్డి, బాలకృష్ణరెడ్డి, చం ద్రకృష్ణరెడ్డి, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:16:32+05:30 IST