Abn logo
Sep 22 2020 @ 01:32AM

సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్‌’

Kaakateeya

సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్‌’ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. నభా నటేశ్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోశ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభమైంది.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ప్రకాశ్‌ రాజ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘సినిమా టైటిల్‌కూ, ఈ మధ్య విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కూ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. త్వరలో టీజర్‌ విడుదల చేస్తాం. వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. సోనూ సూద్‌, ‘వెన్నెల’ కిశోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు ఛాయాగ్రాహకులు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement