ఏపీలోని ఆ గ్రామంలో తలకిందులుగా శివుడు!

ABN , First Publish Date - 2021-01-14T16:55:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్ అంతట కోలాహలం నెలకొంది. ఊరు వాడా సంక్రాంతి సందడి కొనసాగుతోంది.

ఏపీలోని ఆ గ్రామంలో తలకిందులుగా శివుడు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అంతట కోలాహలం నెలకొంది. ఊరు వాడా సంక్రాంతి సందడి కొనసాగుతోంది. డూడూ బసవన్నలు ఒకవైపు.. ఇళ్ల ముందు గొబ్బెమ్మలు మరోవైపు కనువిందు చేస్తున్నాయి. కోలాటాలు, సంప్రదాయపు ఆటలతో పల్లెలు మారుమ్రోగుపోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఎలమదుర్రు గ్రామంలో శివాలయంలో శివుడు తలకిందులుగా ఉంటాడు. తపస్సు చేస్తున్నట్లు శివుడి తల కిందకి, కాళ్లు పైకి ఉంటాయి. అలాగే పార్వతీదేవి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కుమారస్వామికి పాలు ఇస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ యువతీ యువకులు ఆలయం ముందు కోలాటం ఆడడం విశేషం. ప్రతి సంక్రాంతి సమయంలో కోలాటం ఆడతారు. అలాగే హరిదాసులు, సంకీర్తనలు, గంగిరెద్దు మేళాలు.. ఇవన్నీ సంప్రదాయంగా జరుపుకోవడం విశేషం.


అయితే ఇక్కడ ఆలయానికి ఒక ప్రత్యేక ఉంది. అదేంటంటే.. ఆలయం పక్కనే ఉన్న కోనేరు నుంచి నీటిని తీసుకువచ్చి.. ఆ నీటితోనే దేవుడికి ప్రసాదం తయారు చేసి నైవేధ్యంగా పెడతారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆలయ ప్రత్యేకతలు గురించి చెప్పారు. అలాగే శివుడు తలకిందులుగా ఎందుకు ఉన్నదీ వివరించారు. ఆ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2021-01-14T16:55:11+05:30 IST