Abn logo
Aug 2 2021 @ 02:29AM

తెలుగు మనుగడ కోసమే సంస్కృతాన్ని అకాడమీలో చేర్చాం: లక్ష్మీపార్వతి

గుజరాతీపేట(శ్రీకాకుళం), ఆగస్టు 1: ‘‘తెలుగును బతికించేందుకే సంస్కృతాన్ని అకాడమీలో చేర్చారు. నాసా సంస్కృతానికి పెద్దపీట వేసింది. తెలుగు అకాడమీని ఉద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నాం’’ అని అకాడమీ అధ్యక్షురాలు ఎన్‌ లక్ష్మీపార్వతి తెలిపారు. శ్రీకాకుళంలో ఆదివారం ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు.