Abn logo
Mar 13 2021 @ 17:22PM

బీజేపీ నుంచి సన్యాసిరాజు బహిష్కరణ

విజయనగరం: బీజేపీ రాష్ట్ర మాజీ కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజుని పార్టీ నుంచి జిల్లా బీజేపీ శాఖ బహిష్కరించింది. కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర పార్టీ  అధ్యక్ష పదవిని తనకు కేటాయించాలని బీజేపీ అధిష్ఠానాన్నిసన్యాసి రాజు కోరారు. దీంతో పార్టీ క్రమశిక్షణను మీరారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీకి విజ్ఙప్తి చేస్తూ జిల్లా బిజేపి శాఖ తీర్మానించింది.