Abn logo
Sep 22 2020 @ 09:13AM

రైతులను విస్మరించొద్దు..మీడియాకు డాన్సర్ సప్నాచౌదరి వినతి

Kaakateeya

న్యూఢిల్లీ : ప్రముఖ హర్యానా డాన్సర్ సప్నాచౌదరి రైతులకు మద్ధతుగా నిలుస్తూ తాజాగా వీడియోను విడుదల చేశారు. సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ దర్యాప్తు కేసుల మధ్య  రైతుల దుస్థితిని విస్మరించవద్దని గాయని సప్నాచౌదరి మీడియాకు విజ్ఞప్తి చేశారు.‘‘జై జవాన్ జై కిసాన్... మా రైతుల కోసం కూడా మీ గొంతు పెంచాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను’’ అని సప్నాచౌదరి మీడియాను అభ్యర్థించారు.‘‘ రైతుల గొంతుకు మద్దతు ఇవ్వమని నేను మీడియా వ్యక్తులను అభ్యర్థిస్తున్నాను, అదే సమయంలో, రైతుల డిమాండును వినాలని ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నాను’’ అని సప్నాచౌదరి వీడియోలో పేర్కొన్నారు. 

బిగ్ బాస్ 11లో పాల్గొన్న సప్నాచౌదరి ‘వీరే కి వెడ్డింగ్’, హట్ జా తూ’ సినిమాల్లోని ప్రత్యేక నృత్యగీతాలతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.‘నాను కి జాను’లో తేరే తుమ్కే సప్నాచౌదరి, లవ్ బైట్ పాటల్లో నర్తించారు.

Advertisement
Advertisement
Advertisement