Viral video: ‘అత్రంగి రే’ పాటకి సారా అలీఖాన్, అనన్య పాండే నడుము డ్యాన్స్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోలు, సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘అత్రంగి రే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌లో విడుదల కానుంది.


ఇటీవలే ఈ మూవీ నుంచి ‘చకా చక్’ అనే పాట విడుదలై మంచి వ్యూవర్ షిప్‌ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ పాటకి సారాతో కలిసి ‘లైగర్’ భామ అనన్య పాండే వయ్యారంగా తమ నడుమును ఊపుతూ డ్యాన్స్ వేశారు. ముంబైలో జరిగిన లోక్‌మత్ మోస్ట్ స్టైలిష్ అవార్డు 2021 కార్యక్రమంలో పాల్గొన్న ఈ అందాల భామలు వేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది సారా.


ఇందులో సారా తెల్ల పూల లెహెంగాని ధరించగా.. నీలం రంగు లెహంగాని ధరించింది అనన్య. వారి అందంతో పాటు నడుము డ్యాన్స్‌కి ఫిదా అయిన ఈ ఇద్దరి అందగత్తెల ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్‌తో ఈ వీడియోని వైరల్ చేసేశారు.


‘మీరు ఎంతో అందంగా ఉన్నారు. అనన్య, సారా అంటే నాకు ఎంతో ఇష్టమ‌’ని ఒకరు కామెంట్ పెట్టగా.. ‘ఎంతో అందంగా ఉన్నారం’టూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ వైరల్ వీడియోలో ఈ భామల డ్యాన్స్‌పై మీరు ఓ లుక్కేయండి..


Advertisement

Bollywoodమరిన్ని...