Feb 2 2020 @ 17:28PM

ప్రేమ పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు హీరోయిన్ సారా అలీఖాన్ ఫుల్‌స్టాప్ పెట్టేసింది. యువ క‌థానాయ‌కుడు కార్తిక్ ఆర్య‌న్‌తో ఈ అమ్మ‌డు ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సారా ఈ వార్త‌ల‌కు క్లారిటీ ఇచ్చింది. ‘‘కార్తిక్‌ను నేను సెట్స్‌లో మాత్ర‌మే క‌లిసేదాన్ని. మీరు మ‌మ్మ‌ల్ని జంట‌గా చూడాలంటే సినిమాలో చూడాల్సిందే. పుకార్లు రావ‌డం స‌హ‌జం. ఇక‌పై ఇలాంటివి రావ‌ని నేను చెప్ప‌లేను. అయితే నేనేంటో నాకు తెలుసు’’ అన్నారు సారా అలీఖాన్. వీరిద్ద‌రూ క‌లిసి నటించిన ‘లవ్ ఆజ్ క‌ల్‌’..ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల‌కానుంది.