Jun 11 2021 @ 18:00PM

వివో ఐకాన్‌గా సారా అలీఖాన్‌

దేశంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి సంస్థ వివో సరికొత్త సిరీస్‌తో మొబైల్‌ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. వై-సిరీస్‌ పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ల ప్రమోషన్‌ కోసం ‘చీఫ్‌ స్టైల్‌ ఐకాన్‌’గా సారా అలీఖాన్‌ను వివో నియమించింది. వై73 పేరుతో ప్రారంభమయ్యే ఈ వై సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలకు సంబంధించిన మార్కెటింగ్‌ క్యాంపైనర్‌గా ఆమె కొనసాగుతారు. ఇదే విషయంపై వివో ఇండియా బ్రాండ్‌ స్ట్రాటజీ డైరెక్టర్‌ నిపున్‌ మార్య మాట్లాడుతూ, త్వరలో రానున్న వై సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లకు సారా అలీఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులు కావడం, ఆమెతో కలిసి పనిచేయనుండటం తలచుకుంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. అలాగే, సారా అలీఖాన్‌ మాట్లాడుతూ, వివోతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.