ఇప్పటికే జీవితంలో చాలా చూశా.. అమ్మతో కలిసి ఉండేవాడినే పెళ్లి చేసుకుంటా: Sara Ali Khan

నటులు సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్‌ ప్రేమ ముద్దుల తనయ సారా అలీఖాన్ హీరోయిన్‌గా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి.. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, తమిళ స్టార్ ధనుష్‌తో కలిసి ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రం ‘అత్రంగి రే’. డిసెంబర్ 24న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ భామ.


సారా, ఇబ్రహీం పుట్టిన తర్వాత సైఫ్, అమృతా విభేదాల కారణంగా విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఈ అక్కాతమ్ముళ్లు మాత్రం తల్లి దగ్గరే పెరిగారు. ఆ సమయంలో తనకు ఎదురైన అనేక విషయాలపై ఈ బ్యూటీ ఫ్యాన్స్‌తో పంచుకుంది.


సారా మాట్లాడుతూ.. ‘సింగిల్ మదర్‌తో బతకడం ఎంతో కష్టంతో కూడుకున్నది. అది పెరిగేకొద్ది మనుషులని కొంచెం కఠినంగా మార్చుతుంది. అందుకే నేను వేగంగా జీవితం గురించి నేర్చుకున్నా. అన్నీ విషయాలు ముందుగానే నాకు అర్థమయ్యాయ‌‌’ని చెప్పింది.

‘ఏదైనా ఇంటర్వ్యూకి రావాలన్న కూడా నా డ్రెస్‌కి తగ్గ గాజులని మా అమ్మ సెలెక్ట్ చేస్తుంది. ఆమె సహాయం లేకుంటే ఎక్కడికి వెళ్లలేను. అందుకే మా అమ్మకి దూరంగా ఉండలేను. నేను ఎప్పుడూ ఇంటికి వెళ్లిన అక్కడ ఆమె ఉండాల్సిందేన‌’ని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.


ఇంకా మాట్లాడుతూ.. ‘మా అమ్మ నాకు మూడో కన్నులా మారిపోయింది. అందుకే ఆమెని వదిలి జీవితంలో దూరంగా పోలేను. ఇంకా చెప్పాలంటే మా అమ్మతో కలిసి ఉండేవాడినే పెళ్లి చేసుకుంటాన’ని తెలిపింది ఈ తార.

Advertisement

Bollywoodమరిన్ని...