Abn logo
Jul 14 2020 @ 04:50AM

ప్ర‌ముఖ హీరోయిన్‌ డ్రైవ‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తమ ద‌గ్గ‌ర ప‌నిచేసే డ్రైవర్‌కు క‌రోనా సోకింద‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తెలిపారు. ఈ విష‌యాన్ని ముంబై కార్పొరేష‌న్ అధికారుల‌కు తెలియ‌జేయ‌డంతో డ్రైవ‌ర్‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించార‌న్నారు. ఈ నేప‌ధ్యంలో త‌మ‌ కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఆఫీసు సిబ్బందికి క‌రోనా టెస్టులు చేయించ‌గా, అంద‌రికీ నెగిటివ్ రిపోర్టు వ‌చ్చింద‌న్నారు. కాగా సినీనటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అతని భార్య ఐశ్వర్యరాయ్ బ‌చ్చ‌న్‌, కుమార్తె ఆరాధ్య కరోనా పాజిటివ్‌గా తేలిన‌ తరువాత బాలీవుడ్ అభిమానులలో ఆందోళ‌న నెల‌కొంది. త‌మ అభిమాన న‌టులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని వారు ప్రార్థనలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement