సారా తయారీ కేంద్రాలపై దాడులు : ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-04-21T07:02:58+05:30 IST

సారా తయారుచేస్తున్న బట్టీలపై దాడిచేసి 800 లీటర్ల సారా స్వాధీనం చేసు కున్నట్లు సీఐ వై.వి.ఎల్‌.నాయుడు తెలిపారు.

సారా తయారీ కేంద్రాలపై దాడులు : ఇద్దరి అరెస్టు

కైకలూరు : సారా తయారుచేస్తున్న బట్టీలపై దాడిచేసి 800 లీటర్ల సారా స్వాధీనం చేసు కున్నట్లు  సీఐ వై.వి.ఎల్‌.నాయుడు తెలిపారు.  కైకలూ రు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో మంగళవారం ఆయన వివరా లను వెల్లడించారు. పందిరిప ల్లెగూడెం గ్రామంలోని కొల్లేరు  అభయారణ్య పరిధిలో రూరల్‌ఎస్సై టి.రామకృష్ణ  సిబ్బందితో దాడి చేసి ఘంటసాల మైపు పెద్దిరాజు, బలే సుబ్బరాజును అదుపులోకి తీసుకున్నా మన్నారు.  అదే గ్రా మానికి  చెందిన ఘంటసాల శ్రీనివాసరావు, ఘంటసాల రాంబాబు, జయమంగళ కొండలతో కలిసి సారా తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. వారి ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు.  800 లీటర్ల సారా, 5000 లీటర్ల బెల్లపు ఊట స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సారా తయారీకి ఉపయోగించే  15 గ్యాస్‌ బండలు, 17 గ్యాస్‌ స్టవ్‌లు, 53 పాస్టిక్‌ డ్రమ్ములు, స్టీల్‌ బిందెలు, మోటారు ఇంజన్లు రెండు, రేకు పడవను నిందితులను  కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు.


Updated Date - 2021-04-21T07:02:58+05:30 IST