Abn logo
Sep 23 2021 @ 23:42PM

నల్లబెల్లాన్ని తరలిస్తున్న వాహనం స్వాధీనం

సామగ్రితోపాటు నిందితులను చూపిస్తున్న ఎస్‌ఈబీ అధికారులు

సారాతో ముగ్గురి అరెస్టు

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 23 : సారా తయారు చేసేందుకు ఉపయోగించే నల్లబెల్లాన్ని ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనితోపాటు 40 లీటర్ల సారా, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అందిన సమాచారం మేరకు... బుధవారం అర్ధరాత్రి కడప జిల్లా చింతలప ల్లి నుంచి గిద్దలూరు మండలం కంచుపల్లెకి నల్లబెల్లం పెద్దమొత్తంలో ఆటోలో తరలివస్తుందని సమాచారం అందుకున్న ఎస్‌ఈబీ సీఐ అరుణకుమారి సిబ్బందితో కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. వాహనంలో 1200 కిలోల నల్లబెల్లం గుర్తించి వాహనాన్ని, పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీం తోపాటు 5 కిలోల పటిక, 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ అరుణకుమార్‌ తెలిపారు. సారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.