నల్లమలలో సారా దందా

ABN , First Publish Date - 2020-06-04T10:00:49+05:30 IST

నల్లమల ప్రాంతంలో సారా తయారీ మళ్లీ జోరందుకుంది.

నల్లమలలో సారా దందా

పదర, జూన్‌ 3 : నల్లమల ప్రాంతంలో సారా తయారీ మళ్లీ జోరందుకుంది. నాగర్‌క్నూల్‌ జిల్లా పదర మండలంలోని పలు గ్రామాలు, తండాల్లోని శివారు అ టవీ ప్రాంతాల్లో దొరికే ఇప్ప పూలతో సారా తయారీ జరుగుతోంది. కొందరు వ్య క్తులు మూడు బృందాలుగా ఏర్పడి, ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఇందులో మొదటి బృందం నల్ల బెల్లం, పటికను హైదరాబాద్‌ నుంచి నల్లమల ప్రాంతానికి చేరుస్తుంది. రెండో బృందం ఇప్ప పూలను సమకూర్చి సారాను తయారు చే స్తుంది. మూడో బృందం  సారాను హైదరాబాద్‌, ఏపీలోని మాచర్ల, వెల్దుర్తి ప్రాంతాలకు కృష్ణానదిలో గీసుగండి, జెండాపెంట, గున్నపెంట ప్రాంతాల మీ దుగా సారాను రవాణా చేస్తుంది. ఈ దందా కొందరు రాజకీయ నాయకుల అండదండలున్నట్లు తెలిసింది.


లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూ తపడ్డాయి. దీంతో సారాకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో పదర మండలం మద్దిమడుగులో కొందరు రహస్యంగా సారా తయారు చేయడం ప్రారంభించారు. నల్లమల నుంచి సారాను హైదరాబాద్‌కు తరలించి, అక్కడి నుంచి నల్ల బెల్లం, పట్టికను దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా తీసుకొచ్చిన ముడి సరుకును అ చ్చంపేట నియోజకవర్గంలో డంపు చేసి, ఆ తరువాత సారా తయారీ స్థావరాల కు తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, సారా తయారీ జ రుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ మాత్రం దాడులు చేయడం లేదు.


ఇప్పటి వరకు ఏప్రి ల్‌ 4న అమ్రాబాద్‌లో 16 క్వింటాళ్ల బెల్లం, మే 2న అచ్చంపేట పట్టణ శివారు పంట పొలాల్లో రెండు టన్నులను పోలీస్‌ శాఖ, మే 23న 2,100 కిలోల బెల్లం, 120 కిలోల పటికను ఎక్సైజ్‌ సీఐ అనంతయ్య పట్టుకున్నారు. పదర మండలం జ్యోతినాయక్‌తండాలో మే 27న 150 లీటర్ల బెల్లం పానకం, 11 లీటర్ల సారా, బ ల్మూరు మండలంలో 350 లీటర్ల బెల్లం పానకం, 40 కేజీల బెల్లం, పది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. అయినా నల్లమల ప్రాంతంలో సారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా బెల్లంను దిగుమతి చేసుకోకుండా కట్టడి చేసి నిఘా పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-06-04T10:00:49+05:30 IST