Abn logo
Sep 21 2021 @ 15:55PM

నామినేషన్లు వేసిన సర్బానంద్, మురుగన్

న్యూఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్ల పర్యం మొదలైంది.  బీజేపీ నేత, కేంద్ర మంత్రి సర్బానంద్ సోనావాల్ అసోం నుంచి రాజ్యసభ ఉప ఎన్నిక కోసం సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు నామినేషన్ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ పాల్గొన్నారు. మరో బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు నామినేషన్ వేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన వెంట నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్టోబర్ 4న రాజ్యసభ ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption