చీరకట్టు...సొగసు

ABN , First Publish Date - 2021-12-02T06:30:50+05:30 IST

చీరకట్టులో వైవిధ్యం చూపిస్తే ఫిదా కానివారు ఉండరు. చీరకట్టులో డ్రేపింగ్‌తో కనికట్టు చేయవచ్చు. చీర డిజైన్‌ పరంగా మాత్రమే కాదు.....

చీరకట్టు...సొగసు

చీరకట్టులో వైవిధ్యం చూపిస్తే ఫిదా కానివారు ఉండరు. చీరకట్టులో డ్రేపింగ్‌తో కనికట్టు చేయవచ్చు. చీర డిజైన్‌ పరంగా మాత్రమే కాదు, ఆ డిజైన్‌ అందంగా కనిపించాలంటే డ్రేపింగ్‌ కూడా కీలకమే. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న తొమ్మిది రకాల డ్రేపింగ్స్‌ ఇవి...


చూపెట్టు!

సంప్రదాయ చీరలు

ఈ చిత్రంలో రెండు రకాల చీరకట్టులున్నాయి. సంప్రదాయాలను అమితంగా ఇష్టపడే వారు, అందునా దక్షిణ భారత మహిళలు వేడుకల్లో కట్టే తీరు ఈ రెండు రకాల డ్రేపింగ్స్‌లోనూ కనిపిస్తుంది. చిత్రంలో కుడి వైపు వడ్డాణం, దానికి తగినట్లుగా ఆభరణాలు ధరించడం వల్ల చీరకూ నవ్యత వస్తే, ఎడమ వైపు శారీ డ్రేపింగ్‌, సింపుల్‌గా ఉంటూనే చీర చక్కదనం వివరిస్తుంది.


నవ శకానికి నీరాజనం

సంప్రదాయ మూలాలను వదలకూడదని ఉంటుంది. కానీ తాము నేటి తరపు మహిళలమని ఫ్యాషనబుల్‌గా చెప్పాలని ఉంటుంది. అలాంటి నవశకపు అమ్మాయిలు అమితంగా ఇష్టపడే శైలి ఫ్యాంట్‌ శైలి శారీ. సమకాలీన చీరకే తమదైన ధీరత్వం జోడించి తీర్చిదిద్దిన శైలిలే ఇవన్నీ ! ఈ ఆకర్షణీయమైన లుక్‌ను కుచ్చిళ్లను ముందు లేదంటే వెనుక వైపు పెట్టుకుని కూడా సృష్టించవచ్చు.  విభిన్నమైన వడ్డాణాలు లేదంటే లెదర్‌ బెల్ట్స్‌ పెట్టుకోవడం ద్వారా తమదైన చిలిపితనమూ జోడించవచ్చు.


కాక్‌టైల్‌ ఫంక్షన్స్‌ వేళ...

కాక్‌టైల్‌ ఫంక్షన్స్‌ అనగానే లిటిల్‌బ్లాక్‌ డ్రెస్‌ వేసుకోవాలనేమీ లేదు. చీరతోనూ సొగసులు చూపొచ్చు. అదెలా అంటే ఇదిగో ఇలా ! చీరకు సమకాలీన ట్విస్ట్‌ అందించడంలో ఇది ఓ శైలి. ప్యూర్‌ జార్జెట్‌ రఫెల్‌ శారీ ఇది. సింపుల్‌గా ఉంటూనే ఆకర్షణీయంగానూ ఉంటుంది. కాకపోతే సంప్రదాయ వడ్డాణంకు బదులుగా ఆకట్టుకునే రీతిలో ఎంబ్రాయిడర్డ్‌ బెల్ట్‌ వచ్చి చేరింది. ఎలాంటి కాక్‌టైల్‌ ఫంక్షన్స్‌కు అయినా ఈ శైలి బాగుంటుంది.


కుచ్చిళ్లు ముందుకే ఎందుకు?

ఇది ఓ వినూత్నమైన శారీ డ్రేపింగ్‌. లెహంగాతో పాటుగా దుపట్టా ధరించడం సహజం కానీ ఇక్కడ దుపట్టా స్ధానంలో చీర వచ్చి చేరింది. అంతేనా అంటే, కుచ్చిళ్లు వెనుకకు చేరి చీరకట్టును ఆసక్తికరంగానూ మార్చాయి. సంప్రదాయ హాఫ్‌శారీకి నవ్యతను జోడించే మార్గమిది.


నవ్యతకు నీరాజనం

సంప్రదాయ చీర కట్టులో సమకాలీనతకు ఇది ఓ క్లాసిక్‌ ఉదాహరణ. వివాహ వేడుకలకు హాజరైతే పూర్తి ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్టు కచ్చితంగా సరిపోతుంది.  ఇక మొత్తం లుక్‌ మార్చాలనుకుంటే పలజ్జో లేదంటే షరారాతో కలిపి కూడా ధరించవచ్చు.


చీరతోనూ స్టేట్‌మెంట్స్‌ ఇవొచ్చు

నేటి తరం మహిళ తమ వ్యక్తిత్వపు ప్రకటన చేయాలనుకుంటే పుంఖానుపుంఖాలుగా రాయాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇలా స్టేట్‌మెంట్‌ లుక్‌తోనూ చెప్పేయవచ్చు.  బ్రైట్‌ లుక్‌ సిల్క్‌ దుపట్టాతో చీరను మిళితం చేయడంతో పాటుగా వడ్డాణం స్ధానంలో ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రం ధరిస్తే అదే అంతా చెప్పేస్తుంది !


కుచ్చిళ్లు ముందుకే ఎందుకు?

ఇది ఓ వినూత్నమైన శారీ డ్రేపింగ్‌. లెహంగాతో పాటుగా దుపట్టా ధరించడం సహజం కానీ ఇక్కడ దుపట్టా స్ధానంలో చీర వచ్చి చేరింది. అంతేనా అంటే, కుచ్చిళ్లు వెనుకకు చేరి చీరకట్టును ఆసక్తికరంగానూ మార్చాయి. సంప్రదాయ హాఫ్‌శారీకి నవ్యతను జోడించే మార్గమిది.


స్కర్ట్‌తోనూ చీర కట్టొచ్చు...

సమకాలీన చీరకు ఆధునిక మలుపును అందించాలనుకుంటే... ఇదిగో ఇదీ శైలి. బ్లౌజ్‌, లాంగ్‌ స్కర్ట్‌ను అందమైన ప్రింటెడ్‌ శారీతో జత చేయడంతో పాటుగా నడుం వద్ద బెల్ట్‌తో అందంగా కుట్టినట్లుగా కట్టే ఈ కట్టు పార్టీలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.


లెహంగా శైలి...

ఆసక్తికరమైనప్పటికీ, అసమాన రూపంలో లెహంగా తరహా చీరకట్టు ఇది. ఈ అద్భుతమైన లుక్‌ కుట్టడం వల్ల కాదు, చీరకట్టడం వల్ల వచ్చిందంటే నమ్మశక్యమా ? ఈ లెహంగా శైలిలోనూ వైవిధ్యత చూపొచ్చు.


రెండు చీరలు ఒకేసారి కడితే...

రెండు చీరలు ఒకేసారి కట్టొచ్చా ? నిరభ్యంతరంగా.... అనిపించే శైలి ఇది. హాఫ్‌ అండ్‌ హాఫ్‌ లుక్‌ తీసుకురావడానికి రెండు చీరలను ఈ లుక్‌లో డ్రేప్‌ చేశారు. సాలిడ్‌ కలర్‌ శారీలు తీసుకుంటే మీరు కోరుకున్న కలర్‌ బ్లాకింగ్‌ లుక్‌ తీసుకురావొచ్చు.




కర్టెసీ : ప్రియా మాచినేని,

ప్రియా డిజైన్‌ స్టూడియో,

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

జ్యువెలరీ : శాంతి కిరణ్‌ బై ముసద్దీలాల్‌

Updated Date - 2021-12-02T06:30:50+05:30 IST