Abn logo
Oct 22 2021 @ 00:24AM

అమ్మవారికి అగ్గిపెట్టెలో అమిరే చీర బహూకరణ

అగ్గిపెట్టెలో పట్టే చీరను వేములవాడ దేవస్థానం ఈవోకు అందజేస్తున్న విజయ్‌

వేములవాడ టౌన్‌, అక్టోబరు 21:  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి  నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌ గురువారం అగ్గిపెట్టెలో అమిరే చీరను బహూకరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి  చెందిన విజయ్‌ గతంలో అగ్గిపెట్టెలో అమిరే చీరతో పాటు ఉంగరం, దబ్బనంలో దూరే చీర, కుట్టు లేకుండా మగ్గంపై వస్త్రాలను నేశాడు. తాజాగా మరమగ్గంపై ఐదున్నర మీటర్ల పొడవు ఉన్న చీరను తయారు చేశాడు. దీనిని మార్కెట్‌లోకి తీసుకురానున్న నేపథ్యంలో ముందుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారికి సమర్పించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం  చీరను ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌కు అందజేశారు.