ఆరోగ్యశ్రీలో మార్పులకు సర్కార్‌ యోచన

ABN , First Publish Date - 2020-06-02T10:12:49+05:30 IST

వచ్చే జూలైలో దివంగత వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని ఆరోగ్యశ్రీలో మార్పులు తేవడానికి ప్రభుత్వం

ఆరోగ్యశ్రీలో మార్పులకు సర్కార్‌ యోచన

చీపురుపల్లి, జూన్‌ 1: వచ్చే జూలైలో దివంగత వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని ఆరోగ్యశ్రీలో మార్పులు తేవడానికి ప్రభుత్వం యోచిస్తుందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం ఆయన జి. ములంగాంలో రూ.8 లక్షల వ్యయంతో శ్మశాన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్యశ్రీలో కొన్ని రకాల శస్త్ర చికిత్సలకు మాత్రమే నిధులు మంజూరవుతున్నాయన్నారు. అయితే వచ్చే జూలై 8 నుంచి రూ. వెయ్యి లోపు వ్యయమయ్యే చిన్నపాటి వ్యాధుల్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని సర్కార్‌ నిర్ణయించిందన్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసినట్లు చెప్పారు. మరో ఆరు జిల్లాలకు వర్తించే విధంగా ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీ తెలిపారు.


ఈ కార్యక్రమంలో నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, కరిమజ్జి శ్రీను, ఎంపీడీవో కె. రామకృష్ణరాజు, డీఈ, ఏఈ డి. రమేష్‌ పాల్గొన్నారు. పేరిపి ప్రాథమిక పాఠశాల ఆవరణలో  చేపట్టిన నాడు-నేడు పనుల్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నాయకుడు కోరాడ ఫృథ్వీ తదితరులు ఉన్నత పాఠశాల భవనాల సమస్య ను ఎంపీ దృష్టికి తెచ్చారు. నాడు-నేడు ప్రత్యేక జేఈ జాన్స్‌న్‌, హెచ్‌ఎం రవికిషోర్‌, మాజీ సర్పంచ్‌ ఎ.అప్పారావునాయుడు  తదితరులు పాల్గొన్నారు.


ప్రజా సహకారంతోనే అభివృద్ధి  

విజయనగరం టౌన్‌: ప్రజా సహకారంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని  ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. మయూరి కూడలి నుంచి వైఎస్సాఆర్‌ కూడలి వరకూ  రహదారి విస్తరణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌ రోడ్డులో నిత్యం ఎదుర వుతన్న ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం రూ.65లక్షలు  వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రహదారి మధ్యలో డివైడర్‌  ఏర్పాటుచేస్తామన్నారు.


స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించి తమ షాపులను  తొలగించాలని కోరారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మాట్లాడుతూ...   నగరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.  కార్యక్ర మంలో ఈఈ దిలీప్‌, ఏసీపీ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T10:12:49+05:30 IST