Jul 29 2021 @ 18:42PM

31న సర్కార్‌ సర్‌ప్రైజ్‌

మహేశ్‌బాబు హీరోగా పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ చిత్రం సంక్రాంతి బరిలో ఉన్న సంగతి తెలిసిందే! ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్‌కు చక్కని స్పందన వచ్చింది. ఈ నెల 31న చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ నోటీస్‌ను 31న విడుదల చేయనున్నారు. ఈ లుక్‌లో మహేశ్‌ ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.  దీనికి సంబంధించి గురువారం ఓ లుక్‌ బయటకొచ్చింది. ఇందులో మహేశ్‌బాబు బ్యాగ్‌ పట్టుకుని ఉన్నారు. ఈ పోస్టర్‌లో బైక్‌లు, కార్లు కొందమంది రౌడీలతో యాక్షన్‌ సీన్‌లా కనిపిస్తోంది. నవీన్‌ ఏర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ కథానాయిక.