కొత్తపేటలో సర్కారుగుట్ట స్వాహా

ABN , First Publish Date - 2021-04-09T07:01:24+05:30 IST

ప్రకృతిసిద్దంగా ఏర్పడిన గుట్ట.. ఎన్నోఏళ్ల నుంచి చెట్లతో నిండి అహ్లాదాన్ని పంచుతూ, కమనీయంగా కనిపించేది.

కొత్తపేటలో సర్కారుగుట్ట స్వాహా
గుట్టను తవ్వి మొరం తరలిస్తున్న దృశ్యం

అక్రమంగా మొరం తవ్వేసిన వైనం    

వందల ట్రాక్టర్ల మొరం తరలింపు   

ఎకరంకు పైగానే తవ్వేశారు 

ఖానాపూర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 8: ప్రకృతిసిద్దంగా ఏర్పడిన గుట్ట.. ఎన్నోఏళ్ల నుంచి చెట్లతో నిండి అహ్లాదాన్ని పంచుతూ, కమనీయంగా కనిపించేది. గ్రామనడి బొడ్డున ఉన్న గుట్టపై అక్రమార్కుల కన్ను పడిం ది. అంతే మరి.. అందులో ఉన్న మొరంకోసం గుట్ట ఆనవాళ్లు లేకుండా చేశారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ రెవెన్యూ పరిధిలో ఉన్న ఓ మొరం గుట్టను అక్రమార్కులు యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. రెండు రోజుల నుండి ఈ వ్యవహారం కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ పాటికి ఎకరానికి పైగానే తవ్వి, వందల ట్రాక్టర్ల మొరంను తరలించుకు పోయారు. గుట్ట పైకి వాహనాలు వెళ్లేందకు ప్రత్యేకరోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవటం గమనార్హం. ఖానాపూర్‌ మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కొత్తపేట గుట్టను అక్రమార్కులు మొరం త్రవ్వకాలు జరుపుతూ తొలిచేస్తున్నారు. సర్వేనంబర్‌ 289లో, 28 ఎకరాల 17 గుంటలు ప్రభుత్వభూమి ఉండగా అందులో 16 ఎకరాల 30 గుంటలు అసైన్‌డ్‌ క్రింద పోగా, మిగిలిన 11 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో గుట్టప్రాంతం ఉంది. అయితే దీనిపైన కొందరు అక్రమార్కులు కన్ను వేసారు. అందులో ఉన్న మొరం ద్వారా లక్షలు రూపాయలు సంపాఽ దించుకోవచ్చని ప్లాన్‌ వేసారు. అనుకున్నదే తడువు రెండురోజుల నుండి జేసీబీలు ఏర్పాటు చేసుకొని, ట్రాక్టర్ల ద్వారా తరలించుకు పోతున్నారు. గతంలో కూడ ఈ గుట్ట పైనుండి మొరం అక్రమంగా తవ్వకాలు చేస్తే పలువురు ఫిర్యాదు చేయటంతో ఆపివేసారు. అయితే గత రెండు రోజులుగా గుట్ట పైన మొరంను బాహాటంగానే తరలించుకుపోతున్నారు. అక్రమార్కులు జేసీబీని గుట్టపైకి తీసుకు వెళ్లారు. ట్రాక్టర్లును ఏర్పాటు చేసుకొని దూరప్రాంతానికి తీసుకువెళ్లి అమ్ముకుంటున్నారు. దాదాపు  ఎకరానికి పైగానే గుట్టను చుదును చేసా రు. వందల ట్రాక్టర్ల మొరం తరలించారు. ఇందులో పెరిగిన విలువైన చెట్లను కూడ కొట్టి వేసారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విలు వైన మొరంను అక్రమార్కులు తరలించారు. ఇంత పెద్ద గుట్టను స్వాహా చేస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడు. ప్రస్తుతం మిగిలి ఉన్న 11 ఎకరాల 20 గుంటలభూమి కూడ ఆక్రమణకు గురైయ్యే అవకాశాలు లేక పోలే దు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తెలియక పోవటం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి సహజంగా ఏర్పడిన గుట్టను కాపాడాలని కోరుతున్నారు.  కాగా ఈ విషయమై తహసీల్‌దార్‌ నరేందర్‌ను సంప్రధించగా విషయం తనకు తెలియదని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


Updated Date - 2021-04-09T07:01:24+05:30 IST