Oct 23 2021 @ 16:26PM

S.S.Thaman: సర్కార్‌ మ్యూజిక్‌ పూర్తి!

మహేశ్‌ హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రం నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రం మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తయిందని సంగీత దర్శకుడు తమన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు.మహేశ్‌తో సెట్‌లో దిగిన ఫొటోను షేర్‌ చేసి ఈ విషయాన్ని పంచుకున్నారు. సూపర్‌స్టార్‌ షైనింగ్‌ లుక్‌ అదిరిపోయింది అంటూ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ స్పెయిన్‌లో శరవేగంగా జరుగుతోంది. కీలక సన్నివేశాలతోపాటు పాటల చిత్రీకరణ చేస్తున్నారు. ఈ నెలాఖరుకు అక్కడ చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. ప్రస్తుతం తమన్‌ కూడా స్పెయిన్‌లోనే ఉన్నారు. త్వరలో ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేస్తారని తెలుస్తోంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మహేశ్‌ సరసన కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటిస్తున్నారు.