Oct 11 2021 @ 16:51PM

Sarkaruvari pata : దీపావళికి ఫస్ట్ సింగిల్ ?

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో భారీ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా విడుదల విషయంలో ఊహా గానాలు వైరల్ అవుతుండగా..  ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ముఖ్యమైన అప్టేడ్ అభిమానుల్ని ఊరిస్తోంది. 

వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ లో ‘సర్కారు వారి పాట’ కూడా ఒకటి. అయితే రిలీజ్ డేట్స్ లాక్ చేసుకొన్న మిగతా సినిమాల సింగిల్స్ ఎప్పుడో విడుదలయిపోయాయి కానీ, ‘సర్కారు వారి పాట, రాధేశ్యామ్’ మూవీస్ బ్యాలెన్స్ ఉండిపోయాయి. అయితే వీటిలో ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ పై ప్రస్తుతం బజ్ క్రియేట్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ దీపావళి కానుకగా విడుదల కానుందట. తమన్ సంగీతం అందిస్తున్నఈ సినిమాలోని ఆ పాట ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.