Oct 27 2021 @ 12:53PM

Sarkaruvari Pata : స్పెయిన్ షెడ్యూల్ పూర్తి!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’. ఈ సినిమా టీమ్ ఇటీవల ఓ షెడ్యూల్ ను స్పెయిన్ లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు, ఒక సాంగ్ చిత్రీకరించారు. పాట చిత్రీకరణతో ఈ షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు. శేఖర్ మాస్టర్, చిత్ర బృందం దిగిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ‘సర్కారువారి పాట’ ఫైనల్ షెడ్యూల్ కొద్దిరోజుల్లో హైదరాబాద్‌లో మొదలుకానుంది. త్వరలోనే చిత్ర బృందం హైదరాబాద్ లో ల్యాండ్ అవనున్నారు. నవంబర్ నెలాఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయబోతున్నారు. 



బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ‘దూకుడు’ స్థాయిలో ఈ మూవీలో కామెడీని వర్కవుట్ చేస్తున్నారట. చాలా రోజుల తర్వాత మహేశ్ మళ్ళీ ఇందులో కామెడీ టైమింగ్ తో చెలరేగుతారట. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా 14 రీల్స్ ప్లస్, జీ.మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మి్స్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ డేట్లో కాకుండా సమ్మర్ సీజన్ కు రిలీజ్ ను షిఫ్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఏప్రిల్ 28న పోకిరి విడుదల తేదీకి సినిమాను విడుదల చేస్తారని టాక్. అయితే నిర్మాతలు ఇంకా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.