ఇసుక రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై సర్పంచ్‌ దాడి

ABN , First Publish Date - 2021-01-14T06:16:57+05:30 IST

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై సర్పంచ్‌ దాడి చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.

ఇసుక రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై సర్పంచ్‌ దాడి

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారంలో ఘటన

నిడమనూరు, జనవరి 13: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై సర్పంచ్‌ దాడి చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ కొండల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ముప్పారం సర్పంచ్‌ అల్లం శ్రీను కొంతకాలంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10.30 గంటల  సమయంలో  గ్రామ శివారులోని వాగు నుంచి సర్పంచ్‌ తన ట్రాక్టర్‌ తో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా, అదే గ్రామానికి చెందిన గణపురం కొండలు అడ్డుకున్నారు. దీంతో  కొండల్‌పై సర్పంచ్‌ శ్రీను దాడి చేశాడు. కొండల్‌ బైక్‌ను ట్రాక్టర్‌తో తొక్కించి ధ్వంసం చేశాడు. ఈ మేరకు బాఽధితుడు కొండలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా విష యమై సర్పంచ్‌పై గతంలో బైండోవర్‌ కేసులు ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-01-14T06:16:57+05:30 IST