Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్థిక సంఘ నిధులు విడుదల చేయాలని సర్పంచుల వినతి


పాడేరు, డిసెంబరు 3: కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను తమకు విడుదల చేయాలని కోరుతూ పలువురు సర్పంచులు స్థానిక డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌ను కోరారు. ఈమేరకు ఆయనకు సర్పంచులు వినతిపత్రం సమర్పించారు. గ్రామాభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల సర్పంచ్‌లు గ్రామాల్లో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచులు పాంగి పాండురంగస్వామి, బాకూరు వెంకటరమణరాజు, సీదరి రాంబాబు, కూడా శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement