Abn logo
Sep 24 2021 @ 15:41PM

టీఆర్ఎస్‌లో కలకలం రేపిన ఆంధ్రజ్యోతి కథనం

హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధి బిల్లులు రాకపోవడంతో గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారుల ఒత్తిడితో అప్పులు తెచ్చి పనులు పూర్తి చేస్తే వడ్డీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా, మర్కుక్ మండల సర్పంచ్‌ల సమావేశం కలకలం రేపుతోంది. మర్కుక్ మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనుల బిల్లుల కోసం సర్పంచ్‌లు.. అధికారులకు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇందుకు రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ సొంత మండలం, మర్కుక్‌లో జరిగిన సర్పంచ్‌ల భేటీపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రభుత్వంలో కలకలం రేపింది. సర్పంచ్‌ల మీటింగ్‌పై పార్టీ, ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సర్పంచ్‌లు రాజీనామా చేయడం కాదు.. మరోసారి ఇలాంటి సమావేశం నిర్వహిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండిImage Caption