Advertisement
Advertisement
Abn logo
Advertisement

మా సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలి

ఎంపీ మోపిదేవికి సర్పంచుల వినతి 

తాడేపల్లి, నవంబరు 28: సర్పంచ్‌లు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు  కోరారు. ఈ మేరకు ఆదివారం రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలలో తిరిగి జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన రేపల్లె మండలం లంకవానిదిబ్బ సీనియర్‌ సర్పంచ్‌ చిలకలపూడి పాపారావును మోపిదేవి సత్కరించారు. అనంతరం ఎంపీ మోపిదేవిని సర్పంచ్‌లు సత్కరించి సమస్యల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు, సర్పంచ్‌లు ముప్పాళ్ల మనోహర్‌, తోకల సరోజిని, నరసింహరావు, చందు వెంకటసాంబశివరావు, కృష్ణమోహన్‌, మేకతోటి శ్రీకాంత్‌, అమరజ్యోతి సురేష్‌, రత్నకుమారి, డాక్టర్‌ ప్రీతి, రమాదేవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement