సార్స్‌-కోవ్‌-2 తోనే బ్లాక్‌ ఫంగస్‌ ప్రమాదం

ABN , First Publish Date - 2021-06-17T18:00:33+05:30 IST

సార్స్‌-కోవ్‌-2, డెల్టా ఆల్ఫా రూపాంతరంతోనే బ్లాక్‌ఫంగస్‌ ప్రమాదంగా మారిందని విక్రమ్‌ ఆసుపత్రి ఈఎన్‌టీ స్పెషలిస్టు శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. బ్లాక్‌ఫంగస్‌ తీవ్ర ప్రభావం చూపడానికి గ

సార్స్‌-కోవ్‌-2 తోనే బ్లాక్‌ ఫంగస్‌ ప్రమాదం


బెంగళూరు: సార్స్‌-కోవ్‌-2, డెల్టా ఆల్ఫా రూపాంతరంతోనే బ్లాక్‌ఫంగస్‌ ప్రమాదంగా మారిందని విక్రమ్‌ ఆసుపత్రి ఈఎన్‌టీ స్పెషలిస్టు శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. బ్లాక్‌ఫంగస్‌ తీవ్ర ప్రభావం చూపడానికి గల కారణాలపై బుధవారం వర్చువల్‌ రూపంలో మీడియాతో మాట్లాడారు. బ్లాక్‌ ఫంగస్‌ లేదా మ్యుకోమైకోసిస్‌ అనేది అరుదైన, వేగంగా వ్యాపించే జబ్బు అన్నారు. సరైన సమయంలో చికిత్సలు పొంద కపోతే పెను ప్రమాదమన్నారు. డయాబెటీస్‌ లేదా రోగ నిరోధకశక్తి తక్కువ ఉండేవారు తీసుకునే స్టెరాయిడ్స్‌ వంటి మందుల ప్రభావం కూడా వైరస్‌ వచ్చేందుకు కారణమన్నారు. ఇంటర్నల్‌ మెడిసిన్‌ నిపుణులు ప్రమోద్‌ బీ సత్య మాట్లాడుతూ రోగులు సకాలంలో చికిత్సల కు వెడితే నివారించవచ్చునన్నారు. బ్లాక్‌ఫంగస్‌ సోకిన వారు మూడు వారాలపాటు చికిత్సలు పొందితే కోలుకుంటారన్నారు. యాంపోటెరిసిన్‌-బి వంటి వైరస్‌ నిరోధక ఇంజెక్షన్‌లు వాడాల్సి ఉంటుందన్నారు. నెఫ్రాలజిస్ట్‌ పార్థ ప్రదీప్‌శెట్టి మాట్లాడుతూ రోగనిరోధకశక్తి తక్కువ ఉండేవారిపై ప్రభావం చూపుతుందన్నారు. సైనస్‌, మెదడు, కళ్లుపై బ్లాక్‌ఫంగస్‌ ప్రభావం అధికమన్నారు. ఎండోస్కోపిక్‌ శస్త్ర చికిత్సల ద్వారా ప్రయోజనం ఉందని డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-17T18:00:33+05:30 IST