రక్తహీనతతో సతమతం

ABN , First Publish Date - 2022-01-29T05:45:39+05:30 IST

రక్తహీనత.. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రధాన సమస్య.. ఏటికేడు జీవన ప్రమాణస్థాయి పెరగడం, ఆహారపు అలవాట్లలో మార్పు వస్తున్నా.. రక్తహీనత సమస్య స్థాయి మాత్రం తగ్గ డం లేదు.

రక్తహీనతతో సతమతం

- చిన్నారులు, బాలికలు, మహిళల్లో పెరుగుతున్న అనిమియా

- పౌష్టికాహార లోపమే ప్రధాన కారణమంటున్న వైద్య నిపుణులు

- ఆరోగ్యలక్ష్మి ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నా అదే దుస్థితి

- ఉమ్మడి జిల్లాలో పథకం అమలు సరిగా లేదనే అభిప్రాయం

- జాతీయ కుటుంబ సర్వే -5లో వివరాలు వెల్లడించిన కేంద్రం

 వనపర్తి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రక్తహీనత.. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రధాన సమస్య.. ఏటికేడు జీవన ప్రమాణస్థాయి పెరగడం, ఆహారపు అలవాట్లలో మార్పు వస్తున్నా.. రక్తహీనత సమస్య స్థాయి మాత్రం తగ్గ డం లేదు. ప్రధానంగా పౌష్టికాహారలోపంతో ఈ సమస్య ఏర్పడుతోంది.. రక్తహీనత ను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  కొన్నేళ్లుగా అనేక కార్యక్ర మాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవడం లేదు. నేటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చిన్నారు లు, బాలికలు, మహిళా జనాభాలో దాదాపు 70 శాతానికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వ ర్యంలో నేషనల్‌ ఐరన్‌ప్లస్‌ ఇన్షియేటీవ్‌, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ, సబల, ఆశల ద్వారా ఐరన్‌ పోలిక్‌ యా సిడ్‌ ట్యాబ్లెట్ల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్యలక్ష్మి పథకం, వసతి గృహాల్లో హైజెనిక్‌ కిట్ల పంపిణీ, కౌమార దశ బాలికల్లో ఐరన్‌ లోపం తలెత్తకుండా మందుల పంపిణీలాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటి కీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రధా నంగా రాష్ట్రంలో జీవన ప్రమాణ స్థాయిలో వెనుకబాటులో ఉండే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉం ది. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో ఉండగా.. మిగతా నాలుగు జిల్లాలు కూడా వరుస క్రమంలో ఎక్కువ రక్తహీనత స్థాయినే కలిగి ఉన్నాయి. 

 కారణాలు ఇవే 

చిన్నారుల్లో  రక్తహీన త (అనిమియా) శాతం పెరగడానికి పలురకాల కారణాలను వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పుట్టిన సమయంలో తల్లి రక్తహీనత తో బాధపడటం, కావాల్సినన్ని రోజు లు పాలు ఇవ్వకపోవడం, ఐరన్‌ ఎ క్కువగా ఉన్న ఆహారాన్ని అందిం చకపోవడం, పరిసరాలు శుభ్రంగా ఉండకపోవడం, సురక్షిత నీరు తాగ క పోవడం వంటి కారణాల వల్ల చిన్నారుల్లో రక్తహీనత పెరుగుతున్న ట్లు పేర్కొంటున్నారు. మహిళల్లో రక్తహీనత పెరగడానికి ఐరన్‌ సం బంధిత ఆహారం తీసుకోకపోవడం, విటమిన్‌ సీ ఫలాలు తీసుకోకపోవడం, ఎక్కువగా కాల్షియం లభ్యమయ్యే ఆహా రాలను తీసుకోవడం, మెన్‌స్ర్టేషన్‌ సమయంలో ఎక్కువ గా ఐరన్‌లాస్‌ జరగడం, చిన్నప్పటి నుంచి ఐరన్‌ డెఫిషెయన్సీతో బాధపడటం, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా బ్లీడింగ్‌ వల్ల ఐరన్‌ లాస్‌ ఎక్కువగా జరగడం, బాల్య వివాహాలు వంటి కారణా లను ప్రధానంగా సూచిస్తున్నారు. 

ఇప్పటికీ ఏఎన్‌సీ (యాంటినెంటల్‌ చెక్‌ ఆప్స్‌) చెక్‌అప్‌ల ద్వారా మొదటి విడతల్లో ఆశ కార్యా కర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా ఐరన్‌ పోలిక్‌ యాసిడ్‌ ట్యాబ్లెను పంపిణీ చేస్తున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో కూడా ఐరన్‌ మాత్రల పంపిణీ జరుగు తోంది. కానీ కొన్నిసార్లు అసలు వీటి అమలుతీరు గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరో పణలు ఉన్నాయి. కచ్చితంగా ప్రతీగర్భిణి, నాలుగు యాంటినెంటల్‌ చెక్‌అప్‌లకు హాజరు కావాలి. కానీ నాలుగో చెకప్‌ వచ్చే సరికి ఉమ్మడి జిల్లాలో 70 శాతం లోపు గర్భిణులు మాత్రమే హాజరవుతున్నా రు. దీనివల్ల కూడా అసలు సమస్య తెలియక ఇప్పుడు బాగానే ఉందని ఆలోచించే ధోరణి ఎక్కువ వుతోంది. 

చిన్నారుల్లోనే ఎక్కువ 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రక్తహీనత సమస్య  చిన్నారుల్లో తీవ్రంగా ఉంది. ఉదాహరణకు జోగుళాంబ గద్వాల జిల్లా పరిస్థితి తీసుకుంటే ఇక్కడ 6 నుంచి 59 నెలల మధ్య వయసు కలిగిన పిల్లల్లో 82.4శాతం రక్తహీనత సమస్య ఉండగా.. 1-49 ఏళ్ల వయసు కలిగిన మహిళల్లో మాత్రం 64.6శాతమే ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మహిళల్లో రక్తహీనత శాతం 54.7శాతం ఉండగా.. చిన్నారుల్లో మాత్రం 82.6శాతం ఉంది. అన్ని జిల్లాల్లోని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడిస్తున్న సూచనలు అదే విధంగా ఉన్నాయి.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో రక్తహీనత శాతం ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం బాల్య వివాహాలనే అని తేలింది.  బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడకపోతే రక్తహీనత సమస్య కారణంగా ఇప్పటికే పలువురు మహిళలు క్యాన్సర్‌ బారీన పడగా.. వాటిస్థాయి పెరిగే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహారం అందించే ప్రభుత్వం ఆయా పథకాల అమలుతీరుపై కూడా శ్రద్ధ వహించాలని కోరుతోంది. కొద్దిరోజుల క్రితం గద్వాల జిల్లాలో మంత్రి హరీశ్‌రావు సమీక్షలోనూ రక్తహీనత సమస్యపై ఆందోళన వ్యక్తం చేయడం, ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని సూచించడం కారణాలుగా చెప్పవచ్చు. 

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు 

బటాని పప్పు, పాలకూరు, తోటకూర, ఉల్లికాడలు, ఆవాల ఆకులు, మెంతి, పుదీన, శనగపప్పు, సోయాబిన్‌, నువ్వులు, కందిపప్పు, పచ్చి అరటి, మినప పప్పు, పుచ్చకాయ, గుమ్మడికాయ, మటన్‌ వీటిని ఎక్కువగా తీసు కుంటే ఐరన్‌ డెఫిషెయన్సీ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే విటమిన్‌ సీ అధికంగా ఉండే క్యాబేజీ, మునగ ఆకులు, కోతిమీర, కరివేపాకు ఉసిరికాయలను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. 


 

Updated Date - 2022-01-29T05:45:39+05:30 IST