సరిహద్దుల్లోని భారత సైనికులకు శాటిలైట్ ఫోన్లు

ABN , First Publish Date - 2020-08-11T12:27:21+05:30 IST

దేశ సరిహద్దుల్లో, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులకు శాటిలైట్ ఫోన్లు అందించనున్నట్లు....

సరిహద్దుల్లోని భారత సైనికులకు శాటిలైట్ ఫోన్లు

న్యూఢిల్లీ : దేశ సరిహద్దుల్లో, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులకు శాటిలైట్ ఫోన్లు అందించనున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. సరిహద్దుల్లో పహరా కాస్తున్న బీఎస్ఎఫ్,ఐటీబీపీ,శాస్త్ర సీమాబల్, సీఆర్‌పీఎఫ్ జవాన్లు పనిచేస్తున్న ప్రాంతాల నుంచే నేరుగా తమ తమ కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు వీలుగా సైనికులకు ఉపగ్రహ ఫోన్లను ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో దూరంగా ఉన్న సరిహద్దుల్లో పహరా కాస్తున్న 1347 ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం సైన్యానికి ఉపగ్రహ ఆధారిత  ఫోన్లను అందిస్తామని మంత్రి చెప్పారు. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం చేపడుతున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు కూడా శాటిలైట్ ఫోన్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఇప్పటికే సరిహద్దుల్లోని సైనికులకు 183 శాటిలైట్ ఫోన్లు అందించామని మిగిలిన వారికి కూడా త్వరలో ఇస్తామని మంత్రి చెప్పారు. సరిహద్దుల్లో పహరా కాస్తున్న  బీఎస్ఎఫ్,ఐటీబీపీ,శాస్త్ర సీమాబల్, సీఆర్‌పీఎఫ్ జవాన్లకు 1347 శాటిలైట్ ఆధారిత డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్ కూడా అందిస్తామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో టెలీకమ్యూనికేషన్ సేవలను విస్తరించేందుకు కొత్త ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి చెప్పారు. 

Updated Date - 2020-08-11T12:27:21+05:30 IST